మెదక్‌: వరద నష్టాలపై రెవెన్యూ అధికారికి బీజేపీ మేమోరాండం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారికి మేమోరాండం అందజేశారు.

మండలవ్యాప్తంగా కూలిన ఇళ్ల వివరాలు, దాదాపు 4500 ఎకరాల్లో పంట నష్టం, 15 గ్రామాల్లో ధ్వంసమైన రోడ్ల వివరాలు అధికారులకు సమర్పించారు. కలెక్టర్ చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వం నుండి తక్షణ సహాయ నిధులు విడుదల చేసి పునరావాసం, రహదారి మరమ్మతులు, పంట నష్టపరిహారం చేపట్టాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు జవ్వాజి ప్రభు, నాయకోటి శ్యామ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సత్యంతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment