|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలో ఉన్న పోచారం ప్రాజెక్ట్ దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆనకట్ట. 1922లో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ 1.82 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. సాధారణంగా 70 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే నీటిని దిగువకు వదిలే వీలుంది. అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 1.82 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి దిగువకు వెళ్ళింది.

ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ఆనకట్టకు పెద్ద ఎత్తున దెబ్బతినడంతో అధికారులు వెంటనే స్పందించారు. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రత్యేక పర్యవేక్షణలో ముమ్మరంగా మరమ్మత్తు పనులు చేపట్టారు.

ప్రాజెక్ట్ భద్రతను కాపాడుతూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. పోచారం ప్రాజెక్ట్ ప్రాధాన్యం, దాని చారిత్రక విలువను కాపాడుతూ, అలాగే ప్రస్తుతం జరుగుతున్న రక్షణ చర్యలు ప్రజలలో అధికారులపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి.








