కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ – అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో వర్షాల ప్రభావం, వరద పరిస్థితులను సమీక్షించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్: 08462-220183 ద్వారా ప్రజలు సమాచారం అందజేయాలని సూచించారు.

అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించాల్సిందిగా ఆదేశించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు కట్టుబడి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment