|| దృశ్యం న్యూస్ ||
ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నియామకాలతో స్థానిక భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
జిల్లా ఉపాధ్యక్షులుగా నక్క రాజేశ్వర్, కందగట్ల రాంచందర్, బంటు రాము, పోతుగంటి సురేందర్, ప్రమోద్ కుమార్, పాలెపు రాజు ఎంపికయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా పోతంకర్ లక్ష్మీనారాయణ, నిమ్మల శ్రీనివాస్, నాగోళ్ల లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.
అదేవిధంగా జిల్లా కార్యదర్శులుగా సంగం అనిల్, నోముల నర్సారెడ్డి, పొల్కం వేణు, దంపల్లి జ్యోతి, రాధ, సవిత ఎంపికయ్యారు. కోశాధికారిగా చింతకింది శ్రీనివాస్, ఆఫీస్ సెక్రటరీగా బద్దం కిషన్, సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా కూరెళ్ల శ్రీధర్, మీడియా కన్వీనర్‌గా పుట్ట వీరేందర్, ఐటీ ఇన్‌ఛార్జిగా పిల్లి శ్రీకాంత్ లకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకాలతో ఎడపల్లి మండలానికి చెందిన కందగట్ల రాంచందర్, కూరేళ్ల శ్రీధర్ లకు కీలక పదవులు దక్కడంతో స్థానిక భాజపా కార్యకర్తల్లో విశేష ఆనందాన్ని కలిగించింది. పార్టీ శ్రేణులు దీనిని స్వాగతిస్తూ, రాబోయే ఎన్నికలకు ముందు నూతన కార్యవర్గం ఏర్పాటు కావడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, పార్టీని ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయి అని, కొత్త జట్టుతో భాజపా మరింత బలోపేతం అవుతుంది అని అన్నారు.








