నిజామాబాద్: 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు – 77 మందికి జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తార స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన జులై నెలలో మొత్తం 1708 కేసులు నమోదు అయినట్లు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు.

ఈ కేసుల్లో 966 మంది నిందితులు నేరాన్ని న్యాయస్థానంలో ఒప్పుకొనగా వారిలో 77 మందికి జైలు శిక్షలు విధించగా, మిగతా కేసుల్లో న్యాయస్థానం జరిమానాలు విధించింది. అలాగే వాహనాలను మద్యం మత్తులో నడిపిన డ్రైవర్లు, రైడర్లపై కఠిన చర్యలు తీసుకుంటూ, ఆర్‌టీఏ అధికారులకు 62 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు రోడ్లపై అమాయకుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పోలీసులు స్పష్టం చేస్తూ, ఎవ్వరైనా మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదు అని, మద్యం సేవించిన వ్యక్తులకు వాహనం ఇవ్వరాదు అని పోలీసు శాఖ కఠినంగా హెచ్చరించింది.

నిజామాబాద్ పోలీస్ వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ, రోడ్లపై భద్రతను కాపాడే విధంగా చట్టాన్ని గౌరవించాలని సూచించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టాన్ని ఉల్లంఘించిన వారు తప్పక శిక్షార్హులవుతారని హెచ్చరిక ఇచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment