నిజామాబాద్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు – ఆన్‌లైన్ ద్వారా సమాచార నమోదు తప్పనిసరి: పోలీస్ కమిషనర్

|| దృశ్యం న్యూస్ ||

వినాయక చవితి పండుగను శాంతియుతంగా, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కాలనీ, వీధి, గ్రామంలో గణేష్ విగ్రహ ప్రతిష్టించాలనుకునే కమిటీలు తప్పనిసరిగా పోలీస్ శాఖకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. అన్ని గణేష్ మండపాలకు సెక్యూరిటీ అందించేందుకు, పాయింట్ బుక్ ఏర్పాటుకు సంబంధిత సమాచారం అధికారిక లింక్ 👉 http://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా అందించవచ్చు అని తెలిపారు.
అదేవిధంగా భక్తులకు మరియు మండప నిర్వాహకులకు ముఖ్య సూచనలు చేశారు.

🔹 ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టించాలి.
🔹 విగ్రహ తయారీదారులు సేంద్రీయ పెయింట్లను మాత్రమే వాడాలి.
🔹 మండప నిర్వాహకులు అగ్నిప్రమాదాలు, వర్షం వంటి అనుకోని పరిస్థితులకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి.
🔹 ప్రతి మండపం వద్ద 24 గంటలపాటు స్వచ్ఛంద సేవకులు అందుబాటులో ఉండేలా చూడాలి అని,

పర్యావరణ అనుకూల వినాయక చవితి జరపడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి, సమాజంలో శాంతి, భద్రత, సౌహార్దతను కాపాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment