|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగరంలో దోపిడి సంఘటన చోటుచేసుకుంది. 17వ డివిజన్ రాజీవ్ నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలోని సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. ఆలయంలోని సుమారు 30 తులాల వెండి కిరీటము, నాలుగు కిలోల ఇత్తడి సాయిబాబా విగ్రహం, రెండు పెద్ద చెమ్మాయిలు, ఐదు రాగి చెంబులు, మంగళహారతి సామగ్రి సహా అనేక విలువైన వస్తువులను దొంగలు అపహరించారు.

ఉదయం తలుపులు తెరిచిన ఆలయ అర్చకులు ఈ దోపిడిని గుర్తించి వెంటనే పట్టణ 3వ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులను గుర్తించేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఈ ఘటనతో భక్తులు తీవ్ర వ్యధకు లోనయ్యారు.








