శతాధిక ( 105 సం,,) వృద్ధురాలు మారుబాయి కన్నుమూత – 75 ఏళ్లపాటు 1000కి పైగా ప్రసవాలు నిర్వహించిన గౌరవనీయురాలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాఖుర్ధ్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మారుబాయి (వయసు 105) గురువారం ఉదయం మృతి చెందారు. గ్రామంలో అందరి గౌరవాన్ని పొందిన మారుబాయి గత 75 సంవత్సరాలుగా 1000కి పైగా ప్రసవాలు నిర్వహించి అనేక తల్లులకు, శిశువులకు జీవం ప్రసాదించారు. ఆమె సేవలు గ్రామ ప్రజలకు మరువలేనివి అని గ్రామ పెద్దలు, ప్రజలు భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

గ్రామ పెద్ద శివ సాయి పటేల్ సహా పలువురు గ్రామస్థులు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మారుబాయి నిస్వార్థ సేవలతో గ్రామంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రసవాల సమయంలో ఆధునిక వైద్య సదుపాయాలు లేని కాలంలో కూడా ఆమె తన అనుభవంతో అనేక ప్రాణాలను కాపాడారు. ఆమె మరణం గ్రామానికి తీరని లోటు అని గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment