అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ లీకేజ్ – నగరానికి తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేత.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ అశోక్ సాగర్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నగరంలో కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. లీకేజీ మరమ్మతులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ కారణంగా రేపు 06-08-2025 (బుధవారం) త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది అని అధికారులు తెలిపారు.
ఈ మరమ్మత్తుల కారణంగా అర్సపల్లి, డైరీ ఫార్మ్, మాలపల్లి, మిర్చి కాంపౌండ్, తిలక్ గార్డెన్ ఏరియా, ఖలీల్‌వాడి, నాందేవ్ వాడ, సుభాష్ నగర్, కంటేశ్వర్, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్ కాలనీ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా ఉండదని, ప్రజలు ముందుగానే త్రాగునీటి నిల్వలు చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల విజ్ఞప్తిచేస్తూ, మరమ్మతులు పూర్తయ్యాక, త్రాగునీటి సరఫరా పునరుద్ధరించబడుతుంది అని తెలియచేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment