కోటగిరి ఎస్సై పై బీజేపీ నేత ఫిర్యాదు – అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ఎస్సై సునీల్ పై బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు హరికృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఇంటింటికీ బీజేపీ ప్రచారం ముగించుకున్న అనంతరం, హరికృష్ణ కోటగిరిలోని ఓ హెయిర్ కటింగ్ సెలూన్‌కి వెళ్లారు. అదే సమయంలో ఎస్సై సునీల్ కూడా అక్కడే ఉన్నారు. హరికృష్ణ ఫిర్యాదు ప్రకారం, సెలూన్‌లోకి ప్రవేశించిన వెంటనే ఎస్సై అరే ఎవడ్రా నువ్వు, బయటికి వెళ్లు, నేను ఇక్కడ ఉన్నానని కనిపించట్లేదా అంటూ దుర్భాషలాడి, వాగ్వాదానికి దిగినట్టు ఆరోపించారు.

తాను బీజేపీ మండల అధ్యక్షుడినని చెప్పినా ఎస్సై పట్టించుకోలేదని, “నువ్వు అధ్యక్షుడివి అయితే నేను భయపడాలా” అంటూ అవమానపరిచినట్టు హరికృష్ణ పేర్కొన్నారు. వెంటనే పోలీసు సిబ్బందిని పిలిపించి సెలూన్ వర్కర్‌కు “ఇతనికి కటింగ్ చేయొద్దు, షాపు మూసేయండి” అని బెదిరించారని తెలిపారు.

ఈ వ్యవహారంపై సోమవారం బోధన్ ఏసీపీని కలిసి అధికార దుర్వినియోగం, ప్రవర్తనా భంగంపై హరికృష్ణ ఫిర్యాదు చేశారు. పోలీసు వ్యవస్థను బలంగా ఉపయోగించుకొని రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హరికృష్ణ ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment