|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం గురువారం నిర్వహించబడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటైంది. శిబిరంలో మొత్తం 13 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 9 మందికి మోతే బిందు (క్యాటరాక్ట్) సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. తదనంతరం వారికి అవసరమైన శస్త్రచికిత్స కోసం ఆర్మూర్‌లోని లయన్స్ కంటి హాస్పిటల్‌కు పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ మరియు ఆప్థాల్మిక్ అధికారి హరినాథ్ నెహ్రూ సమన్వయంతో నిర్వహించారు. నర్సింగ్ ఆఫీసర్ శ్రీదేవి, వైద్య సిబ్బంది మురళి, సురేష్, పద్మ, సంతోష్, మీనాక్షి పూజ, రాము, రేఖల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది.
ఈ ఉచిత సేవల ద్వారా కంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు నాణ్యమైన వైద్యసహాయం అందించడం జరగడం గర్వకారణమని వైద్య సిబ్బంది తెలిపారు.








