|| దృశ్యం న్యూస్ ||
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం నుంచి జోగిపేట వరకు జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ పాదయాత్రకు సంబంధించి రహదారి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ & సైన్స్, టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజా నరసింహ పరిశీలించారు. పాదయాత్ర మార్గాన్ని పరిశీలిస్తూ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నతి దశరథ, నాయకులు మల్లికార్జున్ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ రామస్వామి, రజక సంఘ అధ్యక్షుడు చాకలి అశోక్, యువనేతలు వినాయక్ గౌడ్, పృథ్వీ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్ర సజావుగా సాగేందుకు పోలీస్ విభాగం, పార్టీ కార్యకర్తల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయాలని నేతలు సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెంచేలా ఈ యాత్ర మార్గనిర్దేశకంగా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు.








