|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ అటవీ ప్రాంతంలో గల పవిత్రమైన శ్రీ రాముల వారి పాదాలు మంగళవారం పూజ కనుల పండగను తలపించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిత్యా బ్రహ్మానందం సరస్వతి స్వామీజీ స్వయంగా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చరిత్ర గురించి స్వామీజీకి స్థానికులు వివరణాత్మకంగా వివరించారు.
ఈ పుణ్య కార్యక్రమంలో మైలారం బాగా రెడ్డి, ధరావత్ దేశ్ నాయక్, దొంతుల నారాయణ, నూకల గంగారం, విట్టల్ రెడ్డి, మురళి, సత్యం తదితరులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్శన రామ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.








