ధర్పల్లిలో సాగునీటి కొరతపై భాజపా ఆందోళన – తాహసిల్దార్‌కు వినతి పత్రం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో సాగునీటి తీవ్ర కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నేతృత్వంలో నాయకులు తాహసిల్దార్‌ను కలిగి వినతిపత్రం అందజేశారు.

భాజపా నేతలు పేర్కొన్న వివరాల ప్రకారం, ప్యాకేజీ 20-21 పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిప్ప మాసాని నుంచి సాగునీరు అందిస్తామన్న హామీలు ఇచ్చినా ఇప్పటికీ అవి నెరవేరలేదని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో సాగునీరు అందిస్తానని చెప్పిన మాటను మర్చిపోయారన్నారు.

ఈసారి వర్షాభావం కొనసాగుతున్న నేపథ్యంలో, పంటల యాజమాన్యం పూర్తిగా నీరుపై ఆధారపడి ఉండటంతో వేలాది ఎకరాలు నష్టంలోకి వెళ్లుతున్నాయని మండిపడ్డారు. తక్షణమే బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన పైప్‌లైన్ లేదా కాంగ్రెస్ చేపట్టిన కెనాల్ల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జీర్రా మహిపాల్ యాదవ్, పాల్ది దాసు, కర్క గంగారెడ్డి, నరేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, గోలి రాజేశ్వర్, బాల్రెడ్డి, పంతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment