|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీకి (విడిసి) కొత్త చైర్మన్‌గా కొమిరి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ – “ఇన్ని కులాల పెద్దల మద్దతుతో తనను చైర్మన్‌గా ఎన్నుకోవడం గర్వకారణంగా ఉంది అని, గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని,” తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాలు, ప్రధాన కార్యదర్శి దేవతి మహేష్, కోశాధికారి గడ్డం రమేష్, సహాయ కార్యదర్శులు కావేటి కిషన్, దువ్వ భూమేష్, బాన్సువాడ గంగాధర్, యాకూబ్ షేక్, సంబెటి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు వెంకట్ రాజ్ తాడిచెట్ల, పడాల శ్రీనివాస్, పాలెపు గణేష్, ఎజ్జ బలరాం, పాల్ది గంగదాస్, గారేపల్లి నర్సా గౌడ్, జర్నీ బాబయ్య, బొక్కల గంగాధర్ లు కూడా హాజరయ్యారు.








