విద్యుత్ ఎర్తింగ్ – వినియోగదారుల భద్రతకు గట్టి కవచం.

|| దృశ్యం న్యూస్ ||

విద్యుత్ శక్తి పంపిణీ వ్యవస్థలో ఎర్తింగ్ (Earthing) అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థగా పరిగణించబడుతోంది. ఇది మానవ జీవిత భద్రతకు తోడుగా, విద్యుత్ పరికరాల రక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్తింగ్ సిస్టమ్ ద్వారా షార్ట్ సర్క్యూట్, అధిక వోల్టేజ్ వంటి ప్రమాదకర పరిస్థితులలో విద్యుత్ ప్రవాహం భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.

ఒక ఇంట్లో విద్యుత్ పరికరాలు వోల్టేజ్ హెచ్చుతగ్గులకు లోనైతే అవి పాడైపోకుండా, కాలిపోకుండా ఉండేందుకు ఎర్తింగ్ వ్యవస్థ మద్దతు ఇస్తుంది. ఇది పరికరాల పని సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, విద్యుత్ ప్రమాదాల సమయంలో మానవ శరీరంపై విద్యుత్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నది ఏమిటంటే – కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లలో గానీ, పాత ఇండ్లలో గానీ, నాణ్యమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన నాణ్యత గల ఎర్తింగ్ రాడ్లు, తామ్ర (కాపర్) లేదా గాల్వనైజ్డ్ ఐరన్ వైర్లు ఉపయోగించి ఎర్తింగ్ ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసుకోవాలని ఇది ఎలక్ట్రికల్ సురక్షలో కీలకంగా ఉంటుందని తెలియచేస్తున్నారు.

ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే విద్యుత్ షాక్, ఫైర్ యాక్సిడెంట్స్ వంటి ప్రమాదాలు సంభవించవచ్చు అని, కాబట్టి ప్రతి వినియోగదారుడు ఇది తమ బాధ్యతగా భావించి ఇంట్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అని విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment