|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు కొత్తగా నియమితులైన ఎస్ఐ కళ్యాణిని బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు శాంతియుతంగా, సమన్వయంతో ఉండాలని కోరారు. ఎలాంటి సంఘటనలు, గందరగోళాలు జరగకుండా నియంత్రించేందుకు సహకరించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్‌పాల్ రెడ్డి, గజ్జల రమేష్, మహమ్మద్ నజీర్, అబ్దుల్ మాజిద్, మలవత్ బాలు, మలవత్ రవి, నరసయ్య, నరేందర్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.








