ఎడపల్లి: మండల స్థాయి అల్ ఇండియా బంజారా సేవ నూతన కమిటీ ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అల్ ఇండియా బంజారా సేవ సంఘం (AIBS) మండల స్థాయి నూతన కమిటీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు జిల్లా పర్యవేక్షకుడు తరాచంద్, మండల ఎన్నికల అధికారి మున్య నాయక్ ఆధ్వర్యంలో వడ్డేపల్లి గ్రామంలోని జగదాంబ మాత సేవాలాల్ మహరాజ్ ఆలయంలో జరిగాయి.

ఈ సందర్భంగా మున్య నాయక్ మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామాల బంజారా సమాజ నేతలతో చర్చించి, ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ కమిటీ ఎంపిక చేశామని చెప్పారు. బంజారా సమాజ అభివృద్ధి, ఐక్యత మరియు సేవల వృద్ధి లక్ష్యంగా కమిటీ ఏర్పాటయ్యిందని తెలిపారు.

 

ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికైన మెగావత్ గంగాధర్ మాట్లాడుతూ, “నాపై చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, కమిటీ సభ్యులతో కలిసి AIBS అభివృద్ధికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను” అని వెల్లడించారు. అదేవిధంగా జిల్లా కమిటీకి, తనకు తోడ్పడుతున్న ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment