కులగణన డేటా ఎంట్రీకి పని చేసినా పారితోషికం అందని ఆపరేటర్లు – అధికారులు స్పందించడం లేదు.

|| దృశ్యం న్యూస్ ||

గత నవంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంలో ఆన్లైన్ కంప్యూటర్ డేటా ఎంట్రీకి పని చేసిన ప్రైవేట్ ఆపరేటర్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతీ ఫారమ్‌కు ₹30 చొప్పున డబ్బులు ఇస్తామని అధికారుల హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ మొత్తాలు అందలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల క్రితమే బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించినప్పటికీ ఎలాంటి రుసుములు జమ కాలేదు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాన్ని పలుమార్లు ప్రజావాణిలో మరియు ప్రత్యక్షంగా ఆశ్రయించినా స్పందన లేకపోయింది. ఈ రోజు మళ్లీ సబ్ కలెక్టర్ ని, ఎమ్మెల్యేని కలిసి తమ బిల్లులు త్వరగా వచ్చేలా చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ కంప్యూటర్స్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, సాలూర మండల ఆపరేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment