|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం జినిగాల గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ మాదిగ మాట్లాడుతూ, “దండోరా ఉద్యమం” 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రారంభమై, నేడు ఎమ్మార్పీఎస్ గా దేశవ్యాప్తంగా వృద్ధి చెందిందని తెలిపారు.
ఈ ఉద్యమం ద్వారా మాదిగ వర్గీకరణ (ఏ, బి, సి) సాధించబడడం గర్వకారణంగా చెప్పుకుంటూ, మాదిగ యువత చదువులో, ఉద్యోగాల్లో అగ్రస్థానానికి చేరాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని కూడా ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు.








