ధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుక నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సూపరిండెంట్ డాక్టర్ శివ శంకర్ మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ లకు వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. వీరికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేస్తూ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ, “వైద్య సిబ్బంది నిరంతరం నమ్మకంగా పనిచేస్తున్నారు. ఆసుపత్రి అభివృద్ధికి వారు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైనది. భవిష్యత్తులోనూ ఇలాగే మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం” అని అన్నారు.

ఈ వేడుకలో ఆసుపత్రి సిబ్బంది భూలక్ష్మి, కృష్ణ, మమత, మురళి, సురేష్, లింగం, వందన, సంతోష్, నరేందర్, పద్మ, పూజ, నవీన్, మీనా, కళా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment