తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబం అదృశ్యం – సాటాపూర్ గ్రామంలో ఆందోళన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన మెగావత్ మోహన్ కుటుంబం జూన్ 14న తిరుపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే జూన్ 17న తిరుగు ప్రయాణంలో ఉన్నామని వారి బావమరిది ఇస్లావత్ రవీందర్‌కు ఫోన్ చేయడం, అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, తిరిగి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళనకు కారణమైంది. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో కలకలం రేగింది.

ఈ మేరకు కుటుంబ సభ్యులు రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రయాణ వివరాలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో వారి ఆచూకీ గుర్తించేందుకు కృషి చేస్తున్నారు.

ఈ ఘటనతో గ్రామస్తులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వారు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
యాత్రలకు వెళ్లే సమయంలో ప్రయాణ వివరాలను బంధువులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment