చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పత్తి రాములు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సిహెచ్ రాజశేఖర్, మాజీ సర్పంచ్ రోలపటి పండరి, ఇతర గ్రామ ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. రైతులు తప్పనిసరిగా ఈ కేంద్రాల ద్వారానే తమ వరి ధాన్యాన్ని విక్రయించాలని, అప్పుడే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నత్తి దశరథ తెలిపారు. ఇది గ్రామస్థులకు ఎంతో లాభదాయకంగా మారనుంది అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment