|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మద్దుల్ తాండ గ₹గ్రామంలో గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గల్ఫ్ దేశాల్లో ఉన్న యువకులు ₹51,016 చందాగా అందజేశారు.
గ్రామ పెద్దలు కొబిరియా, కువుడియ, దేవి, లింబియా, రామదాసు, వలియ, దత్తు తదితరులు ఈ విరాళాన్ని స్వీకరించారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఈ ఆర్థిక సహాయాన్ని గ్రామ ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా గల్ఫ్ యువకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడతామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
గల్ఫ్ యువకుల సేవా నిబద్ధతను ప్రశంసిస్తూ, శ్రీ వీరంజనేయా స్వామి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధి జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు.








