|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం అమలులో కీలక ముందడుగు పడింది.
చౌట్కూర్ మండలం చక్రియాల్ గ్రామంలో మంగళవారం ఈ పథకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నత్తి దశరథ హాజరై లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, మాజీ ఆలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు పండరి ప్రభు శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు సత్యనారాయణ, నర్సింలు, గ్రామ పెద్దలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
ఈ పథకం ద్వారా గ్రామస్తులకు సూక్ష్మపోషకాలు కలిగిన ఉత్తమమైన బియ్యం అందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.








