|| దృశ్యం న్యూస్ ||
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడికి సంబంధించిన ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు ప్రయనిస్తుండగా దూపల్లి గేటు వద్ద సల్మాన్, ముఖిద్ అనే ఇద్దరు యువకులు బస్సును అడ్డగించి డ్రైవర్ శేఖర్, కండక్టర్పై దాడి చేసినట్లు సమాచారం. బాధితుడు శేఖర్ ఎడపల్లి మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆర్టీసీ సిబ్బంది వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.








