బొంగులూరు గ్రామంలో ఘనంగా రంజాన్ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండలంలోని బొంగులూరు గ్రామంలో ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు (రోజా) పాటించిన తర్వాత, నెలవంక దర్శనం చేసుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముస్లింలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్. రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ చిత్ర గోపాల్ రెడ్డి పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ మైనార్టీలతో అందరూ కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment