|| దృశ్యం న్యూస్ ||
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టిడిపి జెండాను ఆవిష్కరించి, పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి డి. విటల్, నిజామాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పావులూరి వెంకటేశ్వరరావు, హనుమంతరావు, బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ కోట గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బొగుళ్ళ వినోద్, వై. సత్యనారాయణ, మార్ని రాజా, ఎం. రవికుమార్, డి. కృష్ణారెడ్డి, సచిన్, వెంకటేష్, మద్దిపూడి శ్రీనివాస్, పెండెం సత్యనారాయణ, శివ, నరసింహులు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.








