|| దృశ్యం న్యూస్ ||
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (IPE), హైదరాబాద్ సంయుక్తంగా “ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ ఇన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్” అనే అంశంపై విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాన్ని శుక్రవారం రోజున విజయవంతంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థులు పరిశోధన రంగంలో ముందడుగు వేయాలని సూచించారు. హైదరాబాద్ నుండి విచ్చేసిన ప్రొఫెసర్ వై. రామకృష్ణ (IPE) ప్రధాన ప్రసంగకర్తగా డాటా అనాలిసిస్ మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్ రచన గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు.
అదే విధంగా, ప్రొఫెసర్ ఆర్. వెంకటేశ్వరరావు (IPE) రిసెర్చ్ మెథడాలజీ పై ప్రసంగిస్తూ, పరిశోధన ప్రణాళికను రూపొందించుకునే విధానాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో డా. బి. ప్రభాకర్, డా. పి. రవిరాజ్, డా. జి. శ్రీనివాస్ రెడ్డి, శారద, గంగాధర్, సంజీవ్, పద్మ, సరిత, డా. రామచందర్, సంధ్య, సరళ, నిహారిక తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. మూడో సంవత్సరం విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








