|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగర ప్రజలకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. OTS వన్ టైమ్ స్కీమ్ ప్రకారం, GO Rt No. 154, ( 25.03.2025 ) ద్వారా ఆర్థిక సంవత్సరం 2023-24 వరకు ఉన్న అస్తి పన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ చేయబడింది. ఈ అవకాశంతో మిగిలిన 10% వడ్డీతో బకాయిలను క్లియర్ చేసుకునే వీలుంది.
ఈ ప్రత్యేకమైన అవకాశం 31.03.2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున నగర ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తక్షణమే బకాయిలను చెల్లించగలరు అని కమిషనర్ తెలిపారు.
ఇంతకు ముందే బకాయిలను చెల్లించిన వారికీ ఆ మొత్తాన్ని రానున్న ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ రూపంలో సర్దుబాటు చేయబడుతుంది అని స్పష్టం చేశారు.








