మెదక్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ పథకం కింద SC, ST, BC, మైనారిటీ, EBC/EWS వర్గాలకు వ్యాపార యూనిట్ల కోసం సబ్సిడీ రాయితీ అందుబాటులో ఉంటుంది. వయస్సు 21-55 సంవత్సరాలు (వ్యవసాయేతర), 21-60 సంవత్సరాలు (వ్యవసాయ) ఉండాలి. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలకు రూ.1,50,000, పట్టణ ప్రాంతాలకు రూ.2,00,000 వరకు ఉండాలి.

సబ్సిడీ రూ.50,000 వరకు 100%, రూ.50,001-1,00,000 వరకు 90%, రూ.1,00,001-2,00,000 వరకు 80%, రూ.2,00,001-4,00,000 వరకు 30% రాయితీ అందుబాటులో ఉంది. వల్నరబుల్ గ్రూప్‌లకు రూ.1,00,000 వరకు 90% సబ్సిడీ ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ 5 ఏప్రిల్ 2025. అర్హుల ఎంపిక 6 ఏప్రిల్ నుంచి 31 మే వరకు జరుగుతుంది. 2 జూన్ నుంచి 9 జూన్ 2025 మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అప్లికేషన్ పూర్తయ్యాక మండల అభివృద్ధి కార్యాలయానికి లేదా మున్సిపాలిటీ కార్యాలయానికి సమర్పించాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment