|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) క్రమబద్ధీకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దరఖాస్తుదారులు పూర్తి స్థాయి రుసుమును చెల్లించి తమ ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్చి 31 లోపు రుసుము చెల్లించే దరఖాస్తుదారులకు ప్రభుత్వం 25% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్లాట్ రుసుము చెల్లించిన వారికి సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేసి భూమి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్డిఓ పీడీ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ అధికారి ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ రాయితీ లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు.








