రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పరిశీలించారు. మీసేవ కేంద్రాలను సందర్శించి తెలంగాణ ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా యువత ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశముందని, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజని, మీసేవ నిర్వాహకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీసేవ కేంద్రాల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment