|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం మెదక్ పట్టణం 13వ వార్డ్ ద్వారకా నగర్ లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. తన మనవడు సుహాన్ష్ రెడ్డి రెండవ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయస్వామి తన ఆరాధ్య దైవం అని తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలతో మెదక్ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఇతర బిఆర్ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.








