మెదక్ కోర్టు భవనాల ఆస్తిపన్ను పూర్తిగా చెల్లింపు – జిల్లా జడ్జికి మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ కోర్టు భవనాలకు సంబంధించి 1.70 కోట్లు (1,70,42,046 రూపాయలు) ఆస్తిపన్ను బకాయిలను పూర్తిగా చెల్లించినందుకు జిల్లా జడ్జి లక్ష్మీ శారదకు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
2004 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను మున్సిపల్ అధికారులు జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించి గురువారం నాటికి మొత్తం చెల్లించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, కోర్టు సిబ్బంది సహకారంతో పన్ను మొత్తం చెల్లించగలిగామని పట్టణ ప్రజలు కూడా నిర్ణయిత సమయంలో ఆస్తిపన్ను చెల్లించాలని కోరారు. కోర్టు భవన పన్ను బకాయిలు చెల్లించేందుకు సహకరించిన కోర్టు సిబ్బంది, వార్డు ఆఫీసర్ ప్రహ్లాద్, ఆర్ఐ భవాని తదితర మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment