మెదక్: పదవ తరగతి పరీక్షలు: కట్టుదిట్టమైన ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, 21 మార్చి నుండి ఏప్రిల్ 4 వరకు జరగబోయే పరీక్షలకు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి అని, ఈ పరీక్షలకు 10,388 మంది విద్యార్థులు హాజరవుతారు అని ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 17 ఫ్లైయింగ్ స్క్వాడ్, 68 సిట్టింగ్ స్క్వాడ్, మరియు 70 చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఎఎన్‌ఎం, ఆశా ఉద్యోగులు మరియు పోలీసుల బందోబస్తు ఉంటుందని వివరించారు. అలాగే, తాగునీరు, బెంచీలు, కుర్చీలు, మూత్రశాలలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

పరీక్షలకు సంబంధించి పేపర్‌లు మరియు ఓఎంఆర్ షీట్ల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని సూచించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా మాల్ ప్రాక్టీస్ నివారించాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాలలో అనుమతించబడవు అని తెలిపారు.

పరీక్ష సాఫీగా జరిగేలా జిల్లా విద్యా కార్యాలయం (9491676947, 9502494882) కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment