|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.
ఓ ప్రకటనలో, చల్లటి నీరు, విశాలమైన గదులు, ఫ్యాన్స్ సౌకర్యం, కిటికీల ద్వారా వెలుతురు, వైద్య సౌకర్యాలు, మరుగుదొడ్లు వంటి అన్ని అవసరాలు పూర్తి చేశాము అని తెలిపారు.
పది పరీక్షలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయని, విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను రాస్తున్నందున వారి మదిలో అనేక ప్రశ్నలు కలగవచ్చు అని, పరీక్షా కేంద్రంలో ఎలా స్పందించాలి?”, “చదివినది వస్తుందా?” వంటి ఆందోళనలు చాలా మందికి ఉంటాయి. ఈ సమయంలో శాంతియుతంగా పరీక్ష రాయడం పౌష్టికాహారం తీసుకోవడం, ప్రశ్నలను జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం అని తెలిపారు.
సైకాలజీ ప్రొఫెసర్లు, “పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అని, ఒత్తిడి, భయం, ఆందోళనలను నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని సూచిస్తున్నారు.
ఇంకా, “పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవడం” అనేది కూడా విద్యార్థులకు చిట్కాగా సూచించారు.








