సిరికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సాయంత్రం సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు.
సీపీ స్టేషన్‌లోని మొత్తం కార్యకలాపాలను సమీక్షించి, పోలీస్ స్టేషన్ పనితీరును, రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ విభాగం పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలవుతున్న తీరును పరిశీలించడంతో పాటు వాహనాల పార్కింగ్ పరిస్థితిని సమీక్షించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు సంబంధించి అధికారులకు కఠిన ఆదేశాలు ఇచ్చారు. గంజాయి వ్యసనానికి లోనయ్యే వారిని కౌన్సిలింగ్ చేయాలని, సైబర్ మోసాల నుంచి ప్రజలు మోసపోకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు.
అదేవిధంగా, గేమింగ్ అప్లికేషన్ల ద్వారా మోసాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment