ప్రజావాణిలో 56 దరఖాస్తులు: పరిష్కారానికి అధిక ప్రాధాన్యత– కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 56 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య కూడా పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కోరారు. ప్రజావాణి ద్వారా వచ్చిన 56 దరఖాస్తుల్లో 19 రెవెన్యూ భూ లవాదేవీలు, 1 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 1 పెన్షన్ మంజూరు, 2 ఉద్యోగ ఉపాధి సంబంధిత దరఖాస్తులు, 33 ఇతర సమస్యలు ఉన్నాయి.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment