మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” వర్క్ షాప్ – వాల్దస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” (ONOE) వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్, కో-కన్వీనర్లు, మండల కన్వీనర్, కో-కన్వీనర్లు పాల్గొన్నారు.

ONOE లక్ష్యాలు, ప్రయోజనాలపై చర్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు, ONOE వక్త గడ్డం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ MLN రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, నారాయణరెడ్డి, ONOE జిల్లా కో-కన్వీనర్లు రంజిత్ రెడ్డి, రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వర్క్ షాప్ ద్వారా ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment