|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న మావంది గ్రామ శివారు వద్ద అక్రమంగా జేసిబి ద్వారా మొరం తవ్వకాలు జరుగుతున్నట్టు గుర్తించి దాడి నిర్వహించారు.
ఈ దాడిలో జేసిబి – 01, లోడెడ్ టిప్పర్లు – 02, అన్‌లోడెడ్ టిప్పర్లు – 02, స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం తదుపరి విచారణ కోసం బోధన్ రూరల్ SHO కి అప్పగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రకృతి వనరులను దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.








