|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ చేగుంట మండలంలోని బాలికల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. పదవ తరగతి ప్రత్యేక తరగతులను కూడా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

విద్యార్థులకు లక్ష్యాలను నిర్ధారించుకొని, వాటిని సాధించడానికి కృషి చేయాలని, చదువులో శ్రద్ధ వహించాలనే సూచన ఇచ్చిన డాక్టర్ రాధా కిషన్, సమయపాలన పట్టిక తయారుచేసుకుని చదవాలని, సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి పరిష్కరించుకోవాలని విద్యార్థులను ఉద్భోధించారు.
ఈ కార్యక్రమంలో ఏఎమ్ఓ సుదర్శన మూర్తి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రఘుపతి, ఉపాధ్యాయులు విజయలత, చల్లా లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి, రాజేశ్వర్, వెంకటేష్, శారద, రాధా, రేఖ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.








