కామ దహనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం పర్యావరణానికి ఎంతో ప్రమాదం : ఏతొండ రాజేందర్

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్, ఆర్య సమాజ్ సభ్యుల సమక్షంలో బోధన్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేద పండితుల ఆధ్వర్యంలో, నిష్ట నియమాలతో కామునికి పూజా కార్యక్రమం నిర్వహించి, గంధపు చెక్కలు మరియు పవిత్రమైన ఆవు నెయ్యిని ఉపయోగించి కాముని దహనం చేశారు.

 

ఈ సందర్భంగా ఏతొండ రాజేందర్ మాట్లాడుతూ, కొంతమంది టైర్లు, ట్యూబులు మరియు ఇతర ప్లాస్టిక్ పదార్థాలను కామ దహనంలో వేయడం వల్ల కలిగే కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అందువల్ల కాలుష్యాన్ని నివారించేందుకు ఈ విధమైన పదార్థాలను దహనంలో ఉపయోగించకూడదని సూచించారు.

కార్యక్రమంలో ఆర్య సమాజ్ పెద్దలు కొత్త రాజేశ్వర్, ప్రదీప్ గుప్తా, హరి కాంత్ చారి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కామ దహనం వంటి పర్వదినాల్లో పర్యావరణహిత పద్ధతులను అనుసరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మరియు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని తెలియచేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment