రుద్రుర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత ఘనంగా జన్మదిన వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, రుద్రుర్ మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా మండల ఇన్‌చార్జి మధు మాట్లాడుతూ, కవిత ఎంపీగా ఉన్న కాలంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేయించారని ముఖ్యంగా బీడీ కార్మికులకు పింఛన్ అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

కవిత నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని పదవులు చేపట్టి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. జన్మదిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలో మండల యువజన అధ్యక్షుడు కన్య ప్రవీణ్, సాయిలు, సాయికిరణ్, షాదుల్లా, కర్రోళ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment