||దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హోలీ పండగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోలీ పండగను శాంతి, సంతోషంతో కుటుంబసమేతంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు తెలిపారు.
ప్రజలకు ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదాలు, జరిమానాలకు కారణం కాకూడదని, అలాగే గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరించారు. పండగ సమయంలో కొత్త చిక్కులు తెచ్చుకోవడం, అనవసరంగా గొడవలకు పాల్పడడం లాంటి చర్యలకు పాల్పడవద్దని, చెరువులు, కుంటాల వద్ద మద్యం మత్తులో వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
మరో ముఖ్యమైన అంశంగా చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల గమనిస్తూ ఉండాలని, అతి ఉత్సాహంతో ప్రమాదాలకు గురి కాకూడదని పేర్కొన్నారు.
సంఘటిత ఘటనలు నివారించడానికి పండగ ఆధ్యంతం వరకు శాంతియుతంగా జరిపించాలని, మద్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై రాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంట్లో సంతోషంగా పండగ జరుపుకోవాలని సూచించారు.
ఈ హోలీ పండగ మీ జీవితాన్ని రంగులమయం చేస్తూ, అనందంగా జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.








