జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలతో సమావేశమైన కలెక్టర్, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

గర్భిణీ మహిళలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకుని, అవసరమైన మందులు, పోషకాహారం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, సి-సెక్షన్ సమస్యలు, కామెర్లు, క్షయ వ్యాధి, పిండం ఎదుగుదల అంతరాయం, రక్తస్రావం వంటి సమస్యలపై ప్రత్యేక శిక్షణను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో ఒక్క మాతా శిశు మరణం కూడా సంభవించకూడదని లక్ష్యంగా పెట్టుకుని ఆరోగ్య కార్యకర్తలు పనిచేయాలని, గత మూడు నెలలతో పోలిస్తే మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని, దీని కోసం కృషి చేసిన వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను అభినందించారు. మెదక్‌ను మాతా శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిప్యూటీ ఎంహెచ్వో తూప్రాన్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నవీన్, వెటర్నరీ హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సృజన, డాక్టర్ రోహిణి, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment