మెదక్‌లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సోమవారం ప్రకటించారు. మెదక్ జిల్లా అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులను విడుదల చేయించారని తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ :

ఈ స్కూల్ అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవన నిర్మాణం కోసం 20-25 ఎకరాల భూమిని కేటాయించేందుకు జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేశారు అని, విద్యార్థులకు పాఠశాల సహా స్కిల్ డెవలప్‌మెంట్ హబ్‌గా ఈ స్కూల్ రూపుదిద్దుకోనుంది.

డిజిటల్ లెర్నింగ్ & కార్పొరేట్ స్థాయి వసతులు :

ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో డిజిటల్ తరగతులు, ఆధునిక ల్యాబ్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వంటి ఆధునిక వసతులు ఉండబోతున్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో చదవలేని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా ఈ స్కూల్ తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురానుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పశువుల పాకల్లో పాఠశాలలు ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment