|| దృశ్యం న్యూస్ ||
ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, ఎల్.ఆర్.ఎస్ అమలుపై సమీక్ష చేపట్టారు.
అధికారులు ప్రతి దరఖాస్తుదారునికి కాల్ చేసి, ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ వివరించాలని సూచించారు. మార్చి 31లోగా రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ వర్తిస్తుందని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, మున్సిపల్, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఎల్.ఆర్.ఎస్ గురించి అవగాహన కల్పించాలని, ప్రతి మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో ఫ్లెక్సీలు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ప్రచారం చేపట్టి, మున్సిపల్ వార్డులు, గ్రామపంచాయతీల్లో బోర్డులు ఏర్పాటు చేసి, సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








