తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, తమ మొక్కులు తీర్చుకున్నట్లు, తిరుమల శ్రీవారి కృపతో మెదక్ జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నానని పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు.

పద్మ దేవేందర్ రెడ్డి వెంట కుమారుడు పునీత్ రెడ్డి, కోడలు దీపిక రెడ్డి, చెల్లెలు అనిత రెడ్డి, వియ్యంకుల లక్ష్మి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై శ్రీవారి ఆశీస్సులతో మరింత కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో ఆలయ పరిసరాల్లో పూజలు నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment