|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను టైమ్బౌండ్లో పరిష్కరించాలన్నారు.

మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించబడినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇది కీలకమని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి.ఆర్.డి.ఓ పి.డి. శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








